LIVING STREAM MINISTRY

అధిక మొత్తంలో పంపిణీ చేయుట కొరకు ప్రచురణలు

ప్రివ్యూ మరియు డౌన్¬¬లోడ్ బుక్ ఫైల్స్

ఈ సముదాయంలో ఉన్న పుస్తకాల లిస్ట్ ఈ దిగువన ఇయ్యబడెను. మరియు మౌలిక, మధ్యస్థ, ఉన్నతస్థాయి అంశాల ప్రకారం ఏర్పాటు చేయబడినవి..మీరు పుస్తకాలను డౌన్ లోడ్ చేసు కోడానికి సహాయం అవసరమైతే. మా మద్దతు పేజీని సందర్శించండి. మీ పుస్తకాలను డౌన్ లోడ్ ప్రారంభించడానికి, క్రిందనున్న పంపిణీ విధానాన్ని దయచేసి అంగీకరించండి.

ఈ సైట్¬¬లో ఫైల్స్ కొరకు పంపిణీ విధానం

ఈ ఏడు పుస్తకాల యొక్క ఎలెక్ట్రానిక్ వర్షన్¬¬ను ఉచితంగా అందుబాటులోనికి తెచ్చినందుకు లివింగ్ స్ట్రీమ్ మినిస్ట్రీ సంతోషిస్తున్నది. అనేకులు ఈ పుస్తకాలన్నిటినీ చదివి, వీటిని ఇతరులకు తెలియజేస్తారని మేం ఆశిస్తున్నాం. సక్రమంగా కొనసాగుట కొరకు ‘ఈ ఫైల్స్’ యొక్క ప్రింటింగును మీ వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే పరిమితం చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఈ ఫైల్స్¬¬ను ఏ రూపంలోనైనా, ఎక్కడికైనా మరల పంపించవద్దు. మీరు ఇంతకంటే ఎక్కువగా కాపీలను నకలు చేయగోరితే దయచేసి నిశ్చితమైన ఉపయోగం కోసం వివరంగ వ్రాసిన వివరణ మరియు అనుమతి కోసం ఒక అభ్యర్థనను mmb.permissions@lsm.orgకు పంపండి. అన్వయించబడే నియమం ప్రకారం కాపీరైట్ నోటీసులన్నీ గౌరవించబడవలెనని కూడా మేం కోరుచున్నాం. ఈ PDF ఫైల్స్ ఏ విధంగాను, ఏ ఇతర ఉపయోగార్థం సవరించబడరాదు లేక మార్చకూడదు.

క్రైస్తవ జీవితము యొక్క ప్రాథమిక విషయాలు, సంపుటి. 1
క్రైస్తవ జీవితము యొక్క ప్రాథమిక విషయాలు, సంపుటి. 1
by Witness Lee and Watchman Nee
బ్యాక్ కవర్ పేజి లో: క్రైస్తవ జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది మరియు ఎంతో అర్థవంతమైనది. అయితే అనేకమంది ఈ జీవితం యొక్క ప్రాథమిక విషయాలను దేవుని వాక్యమైన బైబిలునందు తెలియజేసిన విధంగా అర్థం చేసుకోవడం లేదు. వాచ్¬¬మెన్ నీ గారి చేతను, విట్నెస్ లీ గారి చేతను రచించబడిన క్రైస్తవ జీవితము యొక్క ప్రాథమిక విషయాలు, ఒకటవ సంపుటిలో క్రైస్తవ జీవితం పరిచయం చేయబడి, వివరించబడుతున్నది. మానవ జీవితం యొక్క మర్మం అనే మొదటి అధ్యాయంలో రక్షణను గూర్చిన దేవుని ప్రణాళిక చెప్పబడినది. ఆ తరువాతి అధ్యాయాలు క్రైస్తవునికి అవసరమగు అనేక ప్రాథమిక అనుభవాల్ని తెలియజేస్తున్నవి. చివరి అధ్యాయం ఒక విశ్వాసి క్రైస్తవ జీవితానికి గల అంతిమమైన తాళపు చెవిని అందిస్తున్నది. అదేమనగా, మానవ ఆత్మలో క్రీస్తును అనుభవించుట. దేవుని వెతికేవారికి, క్రీస్తునందు ఎదగాలని ఆశపడే విశ్వాసులకు ఐశ్వర్యవంతమైన మరియు అర్థవంతమైన క్రైస్తవ జీవితం కోసం ఈ సందేశాలు గట్టి పునాది వేస్తాయి.

డౌన్¬లోడ్ PDF ఈ బుక్ ను డౌన్ లోడ్ చేసికొనుటకు పంపిణి విధానమును దయచేసి ఆంగీకరించండి.

క్రైస్తవ జీవితము యొక్క ప్రాథమిక విషయాలు, సంపుటి. 2
క్రైస్తవ జీవితము యొక్క ప్రాథమిక విషయాలు, సంపుటి. 2
by Witness Lee and Watchman Nee
బ్యాక్ కవర్ పేజి లో: క్రైస్తవ జీవితం యొక్క కేంద్రియ అంశం క్రీస్తునే ఎరుగుటయై ఉన్నది. దీని కోసం మనం అనుదినం, ఒక సజీవమైన రీతిలో ఆయనను సంపర్కించుట మరియు అనుభవించుట అవసరం. ఈ అనుభవంలో సరైన ఆత్మీయ ఆహారం, ఎల్లప్పుడు చేసే ఆత్మీయ ఆరాధన, లోతైన ఆత్మీయ ఎదుగుదల అనువాటితో సహా కొన్ని ప్రాథమిక విషయాలు కలిసి ఉన్నాయి. వాచ్¬¬మెన్ నీ గారి చేతను, విట్నెస్ లీ గారి చేతను రచించబడిన క్రైస్తవ జీవితము యొక్క ప్రాథమిక విషయాలు, రెండవ సంపుటిలో ఒక ఆరోగ్యవంతమైన క్రైస్తవ జీవితం కోసమైన మూడు ప్రాథమిక విషయాలు అందించబడుతున్నవి. అవి: ప్రభువుతో సమయం గడుపుట, సులువైన రీతిలో ఆయనను సంపర్కించుట, ఆయనయందు లోతుగా ఎదుగుట. ఈ సందేశాలు అన్వేషకులైన క్రైస్తవులను దేవుని వాక్యమందలి సమృద్ధియైన పోషణలోనికి, క్రీస్తును క్షణక్షణం కలుసుకొనుటలోనికి, దేవుని గూర్చిన లోతైన, అనగా రహస్యమైన అనుభవంలోనికి తెచ్చును.

డౌన్¬లోడ్ PDF ఈ బుక్ ను డౌన్ లోడ్ చేసికొనుటకు పంపిణి విధానమును దయచేసి ఆంగీకరించండి.

సర్వము - ఇమిడియున్న క్రీస్తు
సర్వము - ఇమిడియున్న క్రీస్తు
by Witness Lee
బ్యాక్ కవర్ పేజి లో: పాత నిబంధనలోని సాదృశ్యాలు మరియు ముంగుర్తులన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన చిత్రాన్ని మన ముందుంచుతున్నాయి. వాటిలో అత్యంత విశిష్టమైనది మరియు అత్యధికంగా అశ్రద్ధ చేయబడిన సాదృశ్యం: మంచి దేశం. అనగా కనాను దేశం. ఈ సర్వము - ఇమిడియున్న క్రీస్తు లో విట్నెస్ లీ గారు ఇశ్రాయేలీయులు స్వాస్థ్యంగా పొందిన దేశం, మనకు కొత్త నిబంధన స్వాస్థ్యమగు సర్వము - ఇమిడియున్న క్రీస్తునకు పరిపూర్ణ సాదృశ్యమై ఉండుటను చూపించుటకు ద్వితీయోపదేశ కాండపు కొన్ని భాగాల్ని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ మంచి దేశం యొక్క శోధింపశక్యం కాని ఐశ్వర్యాలలో కొన్ని అంశాల్ని గూర్చి వివరణాత్మకమైన అధ్యయనాన్ని ఆయన దీనియందు ప్రతిపాదించారు. ప్రతి సాదృశ్యం వివరించబడినది మరియు విశ్వాసులమైన మన అనుభవానికి అన్వయింపబడినది. దేవుని నిత్య సంకల్పం నెరవేరుటకుగాను సర్వము - ఇమిడియున్న క్రీస్తు మొదటి నుంచి చివరి వరకు దైవాన్వేషకులను అనుదినం క్రీస్తును ఆ మంచిదేశంగా ఆస్వా దించుటకు, అనుభవించుటకు ప్రోత్సాహపరచును.

డౌన్¬లోడ్ PDF ఈ బుక్ ను డౌన్ లోడ్ చేసికొనుటకు పంపిణి విధానమును దయచేసి ఆంగీకరించండి.

దేవుని ప్రణాళిక
దేవుని ప్రణాళిక
by Witness Lee
బ్యాక్ కవర్ పేజి లో: క్రైస్తవ ఎదుగుదల మరియు పురోగతులపై ఆత్మ సంబంధమైన మనుష్యుడు అను తన ఆత్మీయ ఆణిముత్యాన్ని వాచ్¬మెన్ నీ గారు 1927లో ప్రచురించెను. మానవుడు మూడు భాగములతో అనగా ఆత్మ, ప్రాణం మరియు శరీరం అను వాటితో సమకూర్చబడియున్నాడు అని ఒక సరళమైన విషయంగా గోచరించే బైబిల్ సత్యాన్ని నీ గారు ఆ పుస్తకం నందు వెలువరించెను. ఈ సత్యం విశ్వాసులు తమ ఆత్మీయ జీవితం నందు ఎదిగి పురోగతిని సాధించుట కోసం కేంద్రకమైన మరియు ఆవశ్యకమైన ప్రత్యక్షతగా వెలువరించబడెను. ఇదే పునాదిపై నీ గారి అతి సన్నిహితుడు, అత్యంత నమ్మకస్థుడైన విట్నెస్ లీ గారు రచించారు. దేవుని ప్రణాళిక అనే ఈ పుస్తకంలో లీ గారు బైబిల్ యొక్క కేంద్రక ప్రత్యక్షతను బయలుపరుస్తున్నారు. అదేమనగా, సంఘము నందు తన సంపూర్ణ వ్యక్తత నిమిత్తమై దేవుడు తన్నుతానే మానవునిలోనికి ప్రసరింపజేసికొనగోరుతున్నాడు. ఈ పుస్తకంలో లీ గారు దేవుని ప్రణాళిక ప్రకారంగా ఉన్న దైవిక త్రిత్వం యొక్క చలనాన్ని స్పష్టంగా బయలుపర్చి, దేవుని నిత్య సంకల్పం యొక్క నెరవేర్పు కోసమై ఆయనతో సహకరించుటకైన ఆచరణీయమైన పద్ధతులను విశ్వాసులకు అందిస్తున్నారు.

డౌన్¬లోడ్ PDF ఈ బుక్ ను డౌన్ లోడ్ చేసికొనుటకు పంపిణి విధానమును దయచేసి ఆంగీకరించండి.

క్రైస్తవ జీవితము యొక్క ప్రాథమిక విషయాలు, సంపుటి. 3
క్రైస్తవ జీవితము యొక్క ప్రాథమిక విషయాలు, సంపుటి. 3
by Witness Lee and Watchman Nee
బ్యాక్ కవర్ పేజి లో: క్రైస్తవ జీవితానికి క్రీస్తును గూర్చిన మరికొన్ని ప్రాథమికమైన అనుభవాలున్నాయి. విశ్వాసులుగా, మనం కేవలం తప్పు, ఒప్పు అనే నియమం కంటే ఉన్నతమైన జీవ నియమం ప్రకారం జీవించవలెను. దేవుని జీవం మనలో పనిచేస్తున్నప్పుడు, ఈ జీవపు ప్రకాశం మనల్ని సరైన జీవంలోనికి తెచ్చును, మరియు సంఘమనే దేవుని సమిష్టి వ్యక్తతలోనికి మనల్ని ఇతర విశ్వాసులతో నిర్మించును. వాచ్¬మెన్ నీ గారి చేతను, విట్నెస్ లీ గారి చేతను రచించబడిన క్రైస్తవ జీవితం యొక్క ప్రాథమిక విషయాలు, మూడవ సంపుటిలో ఈ అనుభవాలు వివరించబడు తున్నవి. ప్రభువునందు వారి వ్యక్తిగత ఎదుగుదల కోసం, సంఘ అభివృద్ధి మరియు నిర్మాణం కోసం ఈ సందేశాలు విశ్వాసులందరిలోనికి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని అందించును.

డౌన్¬లోడ్ PDF ఈ బుక్ ను డౌన్ లోడ్ చేసికొనుటకు పంపిణి విధానమును దయచేసి ఆంగీకరించండి.

జీవమును గూర్చిన జ్ఞానం
జీవమును గూర్చిన జ్ఞానం
by Witness Lee
బ్యాక్ కవర్ పేజి లో: ఆయన స్వరూపాన్ని కలిగియుండి ఆయన మహిమను ప్రత్యక్షపరచగలిగిన మరియు ఆయన శత్రువును సంధించుటకు ఆయన అధికారాన్ని కలిగిన మానవుని యందు ఒక సంపూర్ణమైన, సమిష్టియైన వ్యక్తతను సంపాదించుకొనుటే దేవుని కోరిక. అయితే ఈ కోరిక దేవుని సొంత జీవం ద్వారా మాత్రమే నెరవేర్చబడగలదని చాలా కొద్దిమంది విశ్వాసులు మాత్రమే గ్రహింస్తున్నారు. క్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా మనకు అందుబాటులోనికి వచ్చిన దైవిక జీవాన్ని ఎరుగుట మరియు అనుభవించుట అనే విషయాన్ని బహు కొద్దిమంది మాత్రమే తాకియున్నారు. జీవమును గూర్చిన జ్ఞానములో విట్నెస్ లీ గారు జీవానికి పోవు మార్గానికి చెందిన ఆత్మీయ జ్ఞానం ఇస్తున్నారు. ఇది పునర్జన్మతో మొదలై అంతర్యపు జీవ సంవేదనను ఎరుగుట మరియు దాని ప్రకారం జీవించుట అనేదాని వరకు అభివృద్ధి చెందుతున్నది. ఈ జీవమును గూర్చిన జ్ఞానము క్రీస్తును గూర్చిన యథార్థమైన అనుభవం కోసం ఒక శ్రేష్టమైన పునాదిని వేస్తున్నది మరియు దీనికి జత పుస్తకంగా విట్నెస్ లీ గారు వ్రాసిన జీవమును గూర్చిన అనుభవమునకు సహాయకరమైన పరిచయంగా ఉన్నది.

డౌన్¬లోడ్ PDF ఈ బుక్ ను డౌన్ లోడ్ చేసికొనుటకు పంపిణి విధానమును దయచేసి ఆంగీకరించండి.

మహిమ గల సంఘము
మహిమ గల సంఘము
by Watchman Nee
బ్యాక్ కవర్ పేజి లో: దేవుడు సంఘాన్ని, అనగా విమోచించబడిన విశ్వాసులను పరలోకపు దృక్పథంతో చూస్తున్నాడు. పాపపు శక్తి చేతను, పాపం చేతను ఓడించబడినదానిగా ఆమెను చూచుట కంటే దేవుడు సంఘాన్ని క్రీస్తునకు మహిమ గల సరిజోడిగా చూస్తున్నాడు. మహిమ గల సంఘములో వా చ్ మెన్ నీ గారు బైబిల్ నందు సంఘానికి గల నాలుగు అతి ప్రాముఖ్యమైన సాదృశ్యాల్ని గూర్చి చర్చిస్తున్నారు: ఆదికాండము 2లో ఉన్న హవ్వ, ఎఫెసీ 5లో ఉన్న భార్య, ప్రకటన 12లో ఉన్న స్త్రీ, ప్రకటన 21 మరియు 22లో ఉన్న పెళ్లికుమార్తె. దేవుని నిత్య సంకల్పం నెరవేర్చుటకు సంఘానికున్న ఉన్నతమైన పిలుపును గూర్చి ఆయన ఈ ప్రతి సాదృశ్యంలోను తెలియజేస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే కనుగొనబడిన వ్రాతప్రతి మహిమ గల సంఘం యొక్క ఈ నూతనమైన మరియు సరిక్రొత్త తర్జుమాలో అదనంగా చేర్చబడి, దీనిని 1939 శీతాకాలంలోను 1942 శీతాకాలంలోను వాచ్¬మెన్ నీ గారు ఇచ్చిన సందేశాల యొక్క అత్యంత సంపూర్ణమైన రచనగా చేస్తుంది.

డౌన్¬లోడ్ PDF ఈ బుక్ ను డౌన్ లోడ్ చేసికొనుటకు పంపిణి విధానమును దయచేసి ఆంగీకరించండి.